Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మీలో ఎవరు కోటీశ్వరుడు''కి చిరంజీవి బై చెప్పేస్తారా? కారణం ఏమిటి?

''మీలో ఎవరు కోటీశ్వరుడు'' మూడు సీజన్లు అక్కినేని నాగార్జున హోస్ట్‌లో బాగా హిట్టయ్యాయి. కానీ నాలుగో సీజన్‌కు కింగ్ నాగార్జునకు బదులుగా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ ఇవ్వడంతో.. తప్పకుండా మా టీవీ రేటింగ్ అమ

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (16:33 IST)
''మీలో ఎవరు కోటీశ్వరుడు'' మూడు సీజన్లు అక్కినేని నాగార్జున హోస్ట్‌లో బాగా హిట్టయ్యాయి. కానీ నాలుగో సీజన్‌కు కింగ్ నాగార్జునకు బదులుగా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ ఇవ్వడంతో.. తప్పకుండా మా టీవీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. టీఆర్పీ రేటింగ్ రేంజ్ పెరిగిపోతుందనుకున్న వారికి గట్టి షాక్ తగిలింది.

చిరంజీవి నిర్వహించే ''మీలో ఎవరు కోటీశ్వరుడు''కి టీఆర్పీ రేటింగ్ పెరగలేదట. అంతేకాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ షో రేటింగ్ మాత్రం పుంజుకోలేదు. దీంతో ఈ షో నుంచి తప్పుకోవాలని చిరు డిసైడైయ్యారు. పనిలో పనిగా ఈ నెలతో ఈ సీజన్ పూర్తి కానుంది. ఈ సీజన్‌తోనే ఈ ప్రోగ్రామ్ నుంచి చిరంజీవి తప్పుకోవాలని భావిస్తున్నారు.
 
సెప్టెంబర్ నుండి చిరు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా షూటింగ్‌లో చిరు బిజీ అయిపోతారని.. అందుకే ఈ ప్రోగ్రామ్‌ను పక్కనబెట్టేయాలనుకుంటున్నారు. ఉయ్యాలవాడ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చి వరకు జరగనుంది. కాబట్టి అప్పటివరకు చిరంజీవి ఫుల్ బిజీ కావడంతో ఈ కార్యక్రమంపై కన్నేయలేకపోవచ్చు. అందుకే ఈ ప్రోగ్రామ్ నుంచి తప్పుకోవాలని మెగాస్టార్ డిసైడైపోయినట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments