Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ లాల్ మహాభారత్‌లో నటిస్తా... రాజమౌళికి ప్రభాస్ మొండిచేయి?

మలయాళ నటుడు మోహన్ లాల్ సారథ్యంలో 'మహాభారత్' నిర్మితంకానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టును వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై టాలీవుడ్ హీరో ప్రభాస్ స్ప

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (17:54 IST)
మలయాళ నటుడు మోహన్ లాల్ సారథ్యంలో 'మహాభారత్' నిర్మితంకానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టును వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై టాలీవుడ్ హీరో ప్రభాస్ స్పందించారు. 'మహాభారత్'లో భీముడి పాత్రకు మోహన్ లాల్ సరైన వ్యక్తి అని, ఈ చిత్రంలో నటించాలని తనను సంప్రదిస్తే మాత్రం నటించేందుకు అంగీకరిస్తానని చెప్పారు. 
 
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "బాహుబలి-2" చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. దీంతో ఆ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కీలకమైన భీముడి పాత్రకు మోహన్ లాల్‌ను ఎంపిక చేసుకోవ‌డం స‌రైన నిర్ణ‌య‌మేన‌ని అన్నాడు. అలాగే ఆ సినిమాలో మరేదైన పాత్రకు తనను సంప్రదిస్తే అందులో నటించేందుకు సిద్ధమని తెలిపాడు. 
 
నిజానికి మహాభారతాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించాలని భావించాడు. బాహుబలి చిత్రం తర్వాత దానిపై కసరత్తులు చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి కూడా. ఇంతలో మోహన్ లాల్ ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments