Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత ఆవిష్క‌రించిన ‘తిమ్మరుసు’ ప్రమోషనల్ సాంగ్

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (19:13 IST)
priyanka-sathadev
డిఫరెంట్ సినిమాలు, పాత్రలను ఎంచుకోవ‌డ‌మే కాదు. ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోయే న‌ట‌న ఉంటే ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకోవ‌చ్చు అన‌డానికి వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ స‌త్య‌దేవ్‌. ‘బ్లఫ్‌ మాస్టర్‌, ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో ఆక‌ట్టుకున్న స‌త్య‌దేవ్ మ‌రోసారి ‘తిమ్మరుసు’గా మెస్మ‌రైజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై 'మను' వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన  నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. 
 
శుక్ర‌వారం ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర‌యూనిట్‌. ఈ పాట‌ను స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విడుద‌ల చేసి యూనిట్‌ను అభినందించారు. ఇందులో స‌త్య‌దేవ్ లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సాంగ్‌లో హీరో స‌త్య‌దేవ్‌, హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ స‌హా కీల‌క పాత్ర‌లో న‌టించిన బ్ర‌హ్మాజీ, ఇంకా వైవా హర్ష క‌నిపిస్తున్నారు. కిట్టు విస్సాప్ర‌గ‌డ రాసిన ఈ పాట‌..స‌ద‌రు హీరో పాత్ర‌ను ఎలివేట్ చేసేలా పాత్ర గురించి ఓ ఐడియాను క‌లిగించేలా ఈ ప్రమోష‌న‌ల్ సాంగ్ ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 30న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి సిద్ధంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments