Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు సిద్దమైన నో బడ్జెట్‌తో తీసిన ప్రయోగాత్మక చిత్రం 1134

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (16:31 IST)
1134 Movie release poster
కాన్సెప్ట్ ఓరియెంటెడ్, డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌తో కొత్త దర్శకులు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అలాంటి డిఫరెంట్ మూవీస్‌కు థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియెన్స్ సైతం రొటీన్ ఫార్మూలాను తెరపై చూసేందుకు అంతగా ఇష్టపడటం లేదు. అందుకే ఇలాంటి సమయంలో రాబోతోన్న ఓ డిఫరెంట్ ప్రయోగమే  ‘1134’. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా సాగే ఈ సినిమాను నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి తెరకెక్కించారు. శాన్వీ మీడియా బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్‌‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ లభించింది. 
 
రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా బ్యానర్‌‌లపై తెరకెక్కిన ఈ 1134 చిత్రంలో కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందించారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
నటీనటులు: కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments