Webdunia - Bharat's app for daily news and videos

Install App

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చండిక ఆరంభం

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (17:31 IST)
Veera, Sriharsha, Kushi Chauhan
వీరు, శ్రీహర్ష హీరోలుగా, కుషీచౌహన్, నిషాసింగ్, హీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం "చండిక". తోట కృష్ణ దర్శకుడు. కోటిపల్లి ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.పాపారావు నిర్మిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణతో ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంబించారు. దీనికి తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. పలువురు చిత్ర ప్రముఖులు ఈ ప్రారంబోత్సవానికి హాజరై, చిత్ర బృందానికి శుభాకంక్షాలు అందజేశారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.వి.పాపారావు మాట్లాడుతూ, ఈ చిత్రానికి తానే ఒక మంచి కథను అందించానని, భవిష్యత్తులో కోటిపల్లి ప్రొడక్షన్ సంస్థను ఒక పెద్ద సంస్థగా ఎదిగేలా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతిభ గల వారినెందరినో పరిశ్రమకు పరిచయం చేయాలన్నదే తమ సంస్థ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.
 
దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిదని, చాలా సినిమాలలో విలన్ పత్రాలు పోషించిన శ్రీహర్ష ఈ సినిమాలో రెండవ హీరోగా కీలక పాత్రలో నటిస్తున్నారు, హైదరాబాద్ పరిసరాల్లోని చేవెళ్ల దగ్గర ఓ ఫామ్ హౌస్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తీయడం మొదలు పెట్టామని తెలిపారు. 
 
వర్ధమాన నటులు శేషాద్రి, జబర్దస్త్ కార్తీక్;లతో పటు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: సాయినాధ్, మాటలు: వెంకటేష్,సినిమాటోగ్రఫీ: నగేష్, సంగీతం: చేతన, ఎడిటింగ్: శ్రీనివాస్, నిర్మాత కె.వి.పాపారావు, దర్శకత్వం: తోట కృష్ణ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments