Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతను మోసం చేసిన హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (09:36 IST)
ఓ నిర్మాతను హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్ మోసం చేసింది. 'బద్రి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అమీషా పటేల్ ఈ మోసానికి పాల్పడ్డారు. దీంతో ఆమె కోర్టులో లొంగిపోయారు. ఆమె జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ కోర్టులో లొంగిపోయారు. సినిమా ప్రొడక్షన్ పేరిట అమీషా పటేల్ తన నుంచి రూ.2.50 కోట్లను అప్పుగా తీసుకుని, తన డబ్బు ఎగ్గొట్టారంటూ నిర్మాత, వ్యాపారవేత్త అయిన అజయ్ కుమార్ రాంచీ కోర్టును ఆశ్రయించారు. 
 
పైగా, తన వద్ద తీసుకున్న డబ్బులతో సినిమాను పూర్తి చేయకపోగా, తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని అసలు రూ.2.5 కోట్లకు వడ్డీ రూ.50 లక్షలు అయిందని, అందువల్ల తనకు మొత్తం రూ.3 కోట్లు చెల్లించేలా అమీషా పటేల్‌‍ను ఆదేశించాలని అజయ్ కుమార్ కోర్టును కోరారు. 
 
నిర్మాత పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న రాంచీ కోర్టు ఏప్రిల్ 6వ తేదీన అమీషా పటేల్‌‍పై వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆమె శనివారం కోర్టుకు న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. 
 
కాగా, కోర్టు వెలువల మీడియా హడావుడిన చూసిన అమీషా పట్లే ముఖం కనిపించకుండా ముసుగు ధరించి కారెక్కి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయారు. కాగా, పవన్ కళ్యాణ్ నటించిన బద్రి చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments