Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యతో రాంగోపాల్ వర్మ ట్రెండ్ సెట్ చేస్తారంటున్న పూరీ జగన్నాథ్

నందమూరి హీరో బాలకృష్ణ - వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుందా? అవుననే అంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించే బాలయ్య ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చే

Webdunia
ఆదివారం, 11 జూన్ 2017 (14:38 IST)
నందమూరి హీరో బాలకృష్ణ - వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుందా? అవుననే అంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించే బాలయ్య ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తారని పూరీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
 
బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో చేసిన ఫేస్‌బుక్ లైవ్ చాట్‌‌లో పూరీ ఈ విషయాన్ని చెప్పారు. 'ప్రస్తుతం మీతో పనిచేస్తున్న బాలయ్య.. మీ గురువు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తారా..?' అని పూరీ జగన్నాథ్‌ను ఓ అభిమాని ప్రశ్నించగా.. దానికేం భాగ్యం చేస్తారు అని సమాధానమిచ్చారు.
 
'ఎందుకు చేయరు..? ఆర్జీవీ డైరెక్షన్‌లో బాలయ్య సినిమా ఖచ్చితంగా ఉంటుంది' అని బదులిచ్చారు పూరీ. అయితే.. అభిమాని అడిగినందుకు పూరీ అలా చెప్పారా..? లేదంటే ఆర్జీవీతో బాలయ్య సినిమా కోసం ఏవైనా ప్రయత్నాలను పూరీ చేస్తున్నారా..? అనే చర్చ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో నడుస్తోంది. అయితే.. కొత్త కాంబినేషన్లను సెట్ చేస్తున్న బాలయ్య.. ఖచ్చితంగా వర్మతో సినిమా చేసేస్తాడేమోనన్న అభిప్రాయమూ ఫిల్మ్‌నగర్ వర్గాల నుంచి వస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments