Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్‌బాబు అరగంట పాటు అమ్మనా బూతులు తిట్టారు.. బెనర్జీ కన్నీళ్లు

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (18:38 IST)
Actor Banerjee
మా ఎన్నికల వేడి ఇంకా చల్లారేలా లేదు. ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో  ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేశారు. మా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన సభ్యులతో చర్చించిన ప్రకాష్‌ రాజ్‌.. ఒక ప్యానెల్‌ ఫ్రీగా పనిచేయాలంటే.. మరో ప్యానెల్‌ సభ్యులు లేకుండా.. ఒకే ప్యానెల్‌ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే రాజీనామా చేస్టున్నట్టు ప్రకటించారు. 
 
ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తీవ్ర బావోద్వేగానికి గురైయ్యారు సీనియర్‌ నటుడు బెనర్జీ. మా ఎన్నికల రోజు జరిగిన పరిణామాలను వివరిస్తూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. నరేష్ నన్ను ముఠా నాయకుడు అని అన్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. అయినా మౌనంగా ఉన్నాను.. నేను గెలిచినా సంతోషం లేదన్నారు..
 
ఇక, ఎన్నికల రోజు మోహన్ బాబు తిడుతున్నారు.. విష్ణు గొడవ వద్దు అన్నారు.. మోహన్ బాబు కొట్టడానికి వచ్చారు అని కన్నీరు పెట్టుకున్నారు బెనర్జీ… మోహన్‌బాబు పచ్చి బూతులు తిట్టారు.. అర గంట సేపు తిట్టారు.. అమ్మనా బూతులు తిట్టారు.. డీఆర్సీ పెద్దమనిషి గొడవ జరిగితే ఆపాలి.. కానీ, ఎవరు అలాంటి ప్రయత్నం చేయలేదన్న ఆయన.. అలాంటి అసోసియేషన్ లో ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు.
 
ఇంత అవమానంతో ఎందుకు బతకాలి అనుకున్నానని.. మా ఫ్యామిలీ కూడా బాధ పడిందన్నారు.. మూడు రోజులుగా.. మోహన్ బాబు భార్య కూడా ఫోన్ చేసి బాధపడిందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న బెనర్జీ.. వందల మందిలో అమ్మానా బూతులు తిట్టారని.. కానీ, రాజీనామా చేసిన తర్వాత భారం తగ్గిందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments