Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంది అవార్డులను ''ఎల్లో''గా మార్చేశారు.. చిరంజీవి పేరు..?

దేశ వ్యాప్తంగా పద్మావతి సినిమాపై రచ్చ జరుగుతుంటే.. ఏపీలో నంది అవార్డులపై వివాదాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై నటుడు జీవీ సుధాకర్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (13:28 IST)
దేశ వ్యాప్తంగా పద్మావతి సినిమాపై రచ్చ జరుగుతుంటే.. ఏపీలో నంది అవార్డులపై వివాదాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై నటుడు జీవీ సుధాకర్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. సినీ పరిశ్రమను, నంది అవార్డులను ఏపీ సర్కారు ఎల్లోగా మార్చేసిందని విమర్శలు గుప్పించాడు.
 
ఈ మేరకు ద్రాక్షారామంలో మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు తాను దాసరి నారాయణ రావు ప్రోద్భలంతో అరంగేట్రం చేశానని తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని గురించి తెలుసుకున్న దాసరి.. తన పేరు మొదట్లో చిరంజీవి పేరులోని చివరి రెండు అక్షరాలనూ చేర్చారని, ఈ క్రమంలోనే తన పేరు ముందు జీవి చేరిందని సుధాకర్ నాయుడు చెప్పుకొచ్చారు. విజయవాడలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంపై స్పందిస్తూ... బోటు యజమాని రాష్ట్ర మంత్రి కావడంవల్లే ఆ విషయాన్ని తొక్కేశారన్నారు. 
 
మరోవైపు నంది అవార్డులకు లింకు పెట్టి ఏపీ సీఎం చంద్రబాబుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రహసనంగా మార్చేశారని వైకాపా అధికార ప్రతినిధి కె. పార్థసారథి ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో చంద్రబాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలన్నారు. పోలవరంకు కేంద్రం సహకరించకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారని పార్థసారథి సూటిగా ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments