Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనేమైన పాలుతాగే పిల్లోడా : ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు వ్యాఖ్య

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వివాహంపై ఆయన పెద్దనాన్న, టాలీవుడ్ సీనియర్ హీరో, రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఒకింత అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ వివాహం గురించి విలేకరులు కృష్ణంరాజును వద్ద ప్రస్తావిస్

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (09:12 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వివాహంపై ఆయన పెద్దనాన్న, టాలీవుడ్ సీనియర్ హీరో, రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఒకింత అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ వివాహం గురించి విలేకరులు కృష్ణంరాజును వద్ద ప్రస్తావిస్తే... "అతనే (ప్రభాస్) ఆలోచించుకోవాలి.. 30 ఏళ్లు దాటాయి.. ఏమైనా చిన్నపిల్లవాడా. పెళ్లి చేసుకో? ఎప్పుడు చేసుకుంటావు? అని అడుగుతూనే ఉంటాం. పెళ్లి చేసుకుంటాను అని చెబుతూనే ఉంటాడు. కానీ ఓ నిర్ణయం తీసుకోడు అని అన్నాడు.
 
ప్రభాస్ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సీనియర్ నటుడు, ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'అతనే (ప్రభాస్) ఆలోచించుకోవాలి.. ముప్పై ఏళ్లు దాటాయి.. ఏమైనా చిన్నపిల్లవాడా. పెళ్లి చేసుకో? ఎప్పుడు చేసుకుంటావు? అని అడుగుతూనే ఉంటాం. 'పెళ్లి చేసుకుంటాను' అని చెబుతాడు.
 
ఇకపోతే, ఇప్పుడు.. మా కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే.. కొడుకుని ఐదు సంవత్సరాల వయసు వరకు దేవుడిలా చూడాలట. ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వరకు బానిసలా చూడాలట. పద్దెనిమిదేళ్ల లోపు దారిలో పెట్టాలి. పద్దెనిమిదేళ్ల తర్వాత స్నేహితుడిలా చూడాలట అని అన్నారు. ప్రభాస్ ఆర్టిస్ట్‌గా ఎదిగాడని, 'బాహుబలి' సినిమా ప్రధాని మోడీకి బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. 'సాహో' సినిమా తర్వాత ప్రభాస్‌తో తమ సొంత బ్యానర్‌పై ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు చెప్పారు. జూలై, ఆగస్టులలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని కృష్ణంరాజు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments