Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీపీఎం క్లబ్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు : నటుడు నవదీప్

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (10:38 IST)
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్ విభాగం పోలీసుల విచారణకు నటుడు నవదీప్ హాజరయ్యారు. ఈ విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు తన వద్ద విచారణ జరిపారని చెప్పారు. ఏడేళ్ల క్రితం కాల్ లిస్టు ఆధారంగా చేసుకుని ఈ విచారణ సాగిందన్నారు. 
 
ముఖ్యంగా, బీపీఎం అనే క్లబ్‌తో తనకున్న సంబంధాలను తెలుసుకునేందుకు విచారణకు పిలిచారని, ఈ విషయంలో కొంత సమాచార సేకరణ కోసమే వారు నోటీసులు జారీ చేశారని తెలిపారు. అదేసమయంలో తాను ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. శాఖకు చెందిన రామ్ చందర్ వద్ద నేను డ్రగ్స్ కొనలేదని, గతంలో పబ్ నిర్వహించినందువల్లే తనను విచారించారని తెలిపారు. 
 
గతంలో సిట్, ఈడీ కూడా విచారించిందని, ప్రస్తుతం నార్కో పోలీసులు విచారిస్తున్నారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాను. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారని నవదీప్ వెల్లడించారు. 
 
తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారని, తెలంగాణ నార్కో విభాగం అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉందని నవదీప్ తెలిపారు. కాగా, నార్కోటిక్ బ్యూరో అధికారులు నవదీప్ సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments