Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చిత్రానికి నంది రావడం అదృష్టం: నటి అంజలి

''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కు నంది అవార్డు వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 'గీతాంజలి' తర్వాత నేను నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ 'చిత్రాంగద'. నాకు పర్సనల

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (16:10 IST)
''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కు నంది అవార్డు వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 'గీతాంజలి' తర్వాత నేను నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ 'చిత్రాంగద'. నాకు పర్సనల్‌గా చాలా ఇష్టమైన సినిమా. సినిమా కోసం హార్డ్‌ వర్క్‌చేశాను. నా గత చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమా. అశోక్‌ సినిమాను చక్కగా తెరకెక్కించారు. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. నా సోదరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం ఆనందంగా వుందని' అంజలి అన్నారు.
 
అంజలి నటించిన చిత్రాంగద.. శుక్రవారమే విడుదలకానుంది. చిత్ర యూనిట్‌ ఆమెను సత్కరించింది. ఈ సందర్భంగా సోదరితోపాటు ఆమెకు శాలువా కప్పారు. ఈ థ్రిల్లర్‌ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్‌ ఫేం అశోక్‌ దర్శకుడు. శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా అండ్‌ క్రియేటివ్‌ డ్రావిడన్స్‌ పతాకంపై గంగపట్నం శ్రీధర్‌, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
 
సప్తగిరి మాట్లాడుతూ నేను హర్రర్‌ మూవీస్‌లో గతంలో చాలా మంచి రోల్స్‌ చేసి కమెడియన్‌గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. అలాగే చిత్రాంగద సినిమాలో నా రోల్‌కు చాలా మంచి పేరు వస్తుంది. యు.ఎస్‌లో డిఫరెంట్‌ క్లైమాక్స్‌లో సినిమాను షూట్‌ చేశాం. అంజలి హీరోలా యాక్ట్‌ చేశారు. అంజలి కష్టానికి తప్పకుండా ఫలితం వస్తుంది. అశోక్‌ దర్శకత్వంలో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంటాయని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments