Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలు ఇష్టమే గురు... పార్లమెంట్‌లో కలియతిరిగిన అంజలి

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి పార్లమెంటులో కాలుపెట్టింది. మోడలింగ్ రంగం నుంచి వెండితెరమీద తానేంటో నిరూపించుకున్న అంజలి.. ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు జైతో ప్రేమాయణం నడుపుతోంది. ప్రస

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (10:30 IST)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి పార్లమెంటులో కాలుపెట్టింది.  మోడలింగ్ రంగం నుంచి వెండితెరమీద తానేంటో నిరూపించుకున్న అంజలి.. ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు జైతో ప్రేమాయణం నడుపుతోంది. ప్రస్తుతం సినిమా అవకాశాలపై కన్నేసిన అంజలి షూటింగ్‌ల్లో బిజీ బిజీ అయిపోయింది.

అయితే, పార్లమెంట్ చూడాలని ఎన్నాళ్లనుంచో ఉన్న కోర్కెను కూడా తీర్చేసుకుంది అంజలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో కలిసి అంజలి పార్లమెంట్‌ను సందర్శించింది. పార్లమెంట్ భవనాన్ని కలియతిరిగి ఆవరణలో ఎంపీ గీతతో కలిసి ఫొటోలు దిగి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 
జమ్మూకశ్మీర్‌‌లోని వైష్ణోదేవి ఆలయ సందర్శన కోసం వెళ్లిన అంజలి... త్రికూట పర్వతాల్లో కత్రా నుంచి 13.5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో దిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ భవనాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా అంజలి తనకు రాజకీయాలు అంటే ఇష్టమేనని చెప్పింది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అంటే మాత్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments