Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి భావన కిడ్నాప్.. గంటన్నరసేపు కార్లో తిప్పుతూ లైంగిక వేధింపులు

హీరోయిన్ భావన కిడ్నాప్‌కు గురయ్యారు. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించారు. శుక్రవారం షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆమెను దుండగులు అటకాయించి బలవంతంగా కారులో ఎక్కించుకుని గంటన్నరసేపు క

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (14:52 IST)
హీరోయిన్ భావన కిడ్నాప్‌కు గురయ్యారు. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించారు. శుక్రవారం షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆమెను దుండగులు అటకాయించి బలవంతంగా కారులో ఎక్కించుకుని గంటన్నరసేపు కార్లో అటు ఇటు తిప్పుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే శుక్రవారం షూటింగ్ ముగించుకుని త్రిసూర్ నుంచి కోచికి రాత్రి 9.30 గంటల సమయంలో భావన కార్లో వెళుతుండగా ఓ టెంపోలో ఆమె మాజీ డ్రైవర్ సునీల్ కుమార్, ఇతర గుర్తుతెలియని దుండగులు ఫాలో అయ్యారు. అథానీలోని నెదుంబసేరీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో దుండగులు ఆమె కారును టెంపోతో ఢీకొట్టారు. ఆ తర్వాత భావనను ప్రస్తుత డ్రైవర్ మార్టిన్‌‌తో కలిసి మాజీ డ్రైవర్ సునీల్ కుమార్ బలవంతంగా కార్లోకి ఎక్కి.. దాదాపు గంటన్నర పాటు ఆమెపై కార్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 
 
అంతేకాదు.. ఫోన్లో ఆమె ఫొటోలు, వీడియోలు కూడా తీశారు. ఆమెను బెదిరించారు. తర్వాత వారు పళరివత్తం జంక్షన్ వద్ద దిగిపోయారు. వారు దిగిపోయాక అక్కడికి సమీపంలోనే నివసించే సినిమా నిర్మాత వద్దకు వెళ్లి జరిగిన సంఘటన గురించి వివరించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. భావన కార్ డ్రైవర్‌ మార్టిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం