Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ముట్టుకంటే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటా? మీరా మిథున్

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (12:02 IST)
దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన కోలీవుడ్ నటి మీరా ముథున్ సంచలన వ్యాఖ్యానించారు. తనను ముట్టుకుంటే కత్తితో పొడుచుకుని ప్రాణాలు తీసుకుంటానని ప్రకటించారు. 
 
ఇటీవల ద‌ళితుల‌ని ఇండ‌స్ట్రీ నుంచి తరిమేయాలని ఆమె కామెంట్ చేయ‌డంతో మీరాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులతో పాటు ఏడు సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. దళిత - కేంద్రీకృత పార్టీ అయిన విడుదలై చిరుతైగళ్‌ కట్చి పార్టీ ఉప కార్యదర్శి వన్నీయరసు మీరాపై పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేశారు. 
 
మీరా అరెస్టు ఖాయమంటూ వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆమె త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ అది అసాధ్యం అని రాసుకొచ్చింది. సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్టు చేసుకోవచ్చని ఛాలెంజ్ చేసింది. తనను అరెస్టు చేయడం కలలోనే జరుగుతుందని సంచలన కామెంట్లు చేసింది. 
 
కేరళలో తలదాచుకున్న ఆమెను శనివారం అదుపులోకి తీసుకునేందుకు చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు రాగా, ఆ స‌మ‌యంలో మీరా మిథున్ చేసిన ర‌చ్చ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక్కడ ఆడవాళ్లకు రక్షణ లేదా? పోలీసులు చార్చర్‌ చేస్తున్నారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందించండి అంటూ అరుస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. "అంద‌రు న‌న్ను టార్చ‌ర్ చేస్తున్నారు. నన్ను ముట్టుకుంటే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను" అంటూ బెదిరించింది మీరా. ముఖ్యమంత్రి, ప్రధాని మోడీ.. ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ వీడియోలో చెప్ప‌డం గ‌మ‌న‌ర్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments