Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముమైత్ ఖాన్ కారులో అసభ్యంగా ప్రవర్తించింది.. అలా చేయొద్దన్నందుకు (Video)

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (19:49 IST)
టాలీవుడ్ ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ బండారాన్ని ఓ కారు డ్రైవర్ బట్టబయలుచేశాడు. గోవా ట్రిప్ సమయంలో ముమైత్ ఖాన్ కారులో అసభ్యంగా ప్రవర్తించిందని ఆరోపించారు. పైగా, అలా చేయొద్దన్నందుకు తనను బూతులు తిట్టిందని వాపోయాడు. ఇదే అంశంపై తాను అసోసియేషన్లో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. 
 
ఇంతకీ ముమైత్ ఖాన్ ఇబ్బంది పెట్టింది ఓ ట్యాక్సీ డ్రైవర్ రాజు. దీంతో ఆ ట్యాక్సీ డ్రైవర్ ముమైత్ ఖాన్ బండారాన్ని బయటపెట్టాడు. పైగా, తనను ఏ విధంగా వేధించాడో పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. దీనిపై డ్రైవర్ రాజు మాట్లాడుతూ, ముమైత్‌ ఖాన్‌ రూ.30 వేలకు గోవా ట్రిప్‌ మాట్లాడుకుందని, మూడు రోజుల కోసం గోవా ట్రిప్‌కు కారు తీసుకెళ్లిందన్నారు. 
 
అయితే 5 రోజుల పాటు గోవాలో తిప్పిందని వాపోయాడు. డీజిల్‌ ఖర్చుకు డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని, కారులో మద్యం, సిగరెట్లు తాగుతూ అసభ్యంగా ప్రవర్తించిందని వాపోయాడు. 'అలా చేయొద్దన్నందుకు నన్ను బూతులు తిట్టి బెదిరించింది. ముమైత్‌ ఖాన్‌ దగ్గర పనిచేసిన డ్రైవర్లు కాల్ చేసి.. తమను కూడా ఇబ్బంది పెట్టిందని వారి బాధలు చెప్పుకుంటున్నారు. 
 
రోజు కూలీ చేసుకునే నాపట్ల ఇలా వ్యవహరిస్తుందనుకోలేదు. ఒక సెలబ్రిటీ ఇలా వ్యవహరిస్తుందని అనుకోలేదు. గోవా నుంచి వచ్చిన వెంటనే 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాను. మా డ్రైవర్ల అసోసియేషన్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. నాకు రావాల్సిన రూ.15 వేలు ఇస్తుందో లేదో తెలీదు' అంటూ డ్రైవర్ రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
కాగా, ముమైత్‌ ఖాన్‌‌పై డ్రైవర్‌ రాజు చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను మోసం చేసిందని రాజు మంగళవారం నుంచి మీడియాతో తన బాధలను చెప్పుకున్నాడు. టోల్ గేట్‌కు, డ్రైవర్ అకామిడేషన్‌కు డబ్బులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
సోషల్ మీడియా వేదికగా టోల్‌గేట్ దగ్గర కట్టిన డబ్బులు తాలూకు రిసిప్ట్స్‌, ముమైత్‌తో కలిసిన దిగిన ఫొటోలు, ఆమెతో చేసిన వాట్సాప్ చాట్‌ను రాజు షేర్ చేశాడు. ముమైత్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇంతవరకూ ముమైత్ మాత్రం కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందిచకపోవడం గమనార్హం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments