Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాన్సుల కోసం చీకటి గదిలో చీరలిప్పానంటున్న తెలుగు నటి!?

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (16:11 IST)
మీటూ ఉద్యమంతో మంచి పబ్లిసిటీ కొట్టేసిన నటి శ్రీరెడ్డి. పలు చిత్రాల్లో నటించింది కూడా. ఇపుడు తమిళంలో మూడు ప్రాజెక్టుల్లో చేసేందుకు కమిట్ అయింది. అలాగే, తెలుగులో మరో మూడు ప్రాజెక్టుల్లో నటించేందుకు అవకాశం వచ్చింది. అయితే, డీఎంకే యువజన విభాగం నేత, తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్‌తో హైదరాబాద్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో ఓ రాత్రి ఏకాంతంగా గడిపినట్టు శ్రీరెడ్డి ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ఇది వైరల్ అయింది. దీనిపై డీఎంకే శ్రేణులు మండిపడ్డాయి. దీంతో శ్రీరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఫేస్‌బుక్ పోస్టుపై వివరణ ఇచ్చింది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సినిమాల్లో అవకాశాల కోసం తాను గతంలో తప్పులు చేశానని, ఇకపై అలా చేయబోనని స్పష్టం చేసింది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలన్న ప్రయత్నాల్లో తానున్నానని, తనను ఆదరిస్తున్న తమిళ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రానున్నానని అన్నారు.
 
ఇటీవలి కాలంలో తన పేరిట సోషల్ మీడియాలో తప్పుడు ఖాతాలు తెరిచారని, వాటిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. చాలా మంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని, ఈ విషయమై తాను బహిరంగంగా నిజాలను చెప్పినా, తనకు ఎవరి నుంచీ మద్దతు లభించలేదని వాపోయారు. 
 
తమిళ నటుడు ఉదయనిధిపై ఆరోపణలు చేస్తూ, తాను ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, ఉదయనిధిని తాను ఎన్నడూ నేరుగా కలవలేదని స్పష్టం చేశారు. ఎవరో నకిలీ ఖాతాను సృష్టించి, పనిగట్టుకుని తన పేరిట ఉదయనిధిపై ఆరోపణలు చేశారని ఆమె ఆరోపించారు. ఉదయనిధి పేరు, ప్రతిష్టలను దెబ్బతీయాలని ఎవరో ప్రయత్నిస్తున్నారని, వారి సంగతి పోలీసులే చూసుకుంటారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం