Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదా శర్మ బెల్లీ డ్యాన్స్ అదిరిపోయింది (వీడియో)

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (11:34 IST)
'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ ఆదాశర్మ. ఈమెకు సరైన సినీ ఛాన్సులు లభించలేదు. అరకొరా చిత్రాల్లో నటించే అవకాశం లభించినా సెకండ్ హీరోయిన్‌గానే వచ్చాయి. అల్లు అర్జున్ నటించి 'సన్నాఫ్ సత్యమూర్తి', సాయి ధరమ్ తేజ్ నటించిన 'సుబ్రహ్మణ్యపురం ఫర్ సేల్', 'క్షణం' వంటి చిత్రాల్లో నటించి, తన నటనతో ప్రతి ఒక్కరినీ మెప్పించింది. 
 
ఈమెకు సినీ అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తూనే ఉంటుంది. వివిధ రకాల వెరైటీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తూ ఉంటుంది. 
 
ఆ మ‌ధ్య‌ కికి ఛాలెంజ్‌కి సంబంధించిన వీడియోతో పాటు బెల్లీ డ్యాన్స్ వీడియోల‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వావ్ అనిపించింది. తాజాగా మద్యం సేవించడం వల్ల వచ్చే అన‌ర్థాల‌ని వివ‌రిస్తూ ఓ వీడియో చేసింది. బెల్లీ డ్యాన్స్ చేస్తూ బీర్‌ను తాగుతున్నట్టుగా వీడియోలో ఉంది. ఈ వీడియోకి అద్భుతమైన స్పందన వస్తోంది. 
 
గతంలో కూడా ధూమపానానికి వ్యతిరేకంగా ఆమె రూపొందించిన వీడియో వైరల్ అయింది. ఆదాశ‌ర్మ ప్ర‌స్తుతం ప‌లు బాలీవుడ్ సినిమాల‌తో పాటు హ‌లీవుడ్ సినిమా చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. తెలుగులో అ మూవీ ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న "క‌ల్కి"లో న‌టిస్తుంది. రాజ‌శేఖ‌ర్ ప్రధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I'm the most fortunate actress who has sooooo much support for all the mad stuff I do and I louuuvee u guys for that

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments