Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్ఞాతవాసి ట్రైలర్: కుర్చీకథ.. కౌగిలించుకోలేదండీ... జస్ట్ పట్టుకున్నామంతే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుని విడుదలకు సిద్ధమైన ''అజ్ఞాతవాసి'' సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఇది మనం కూర్చునే కుర్చీ... పచ్చటి చెట్టును గొడ్డలితో

Webdunia
ఆదివారం, 7 జనవరి 2018 (11:35 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుని విడుదలకు సిద్ధమైన ''అజ్ఞాతవాసి'' సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఇది మనం కూర్చునే కుర్చీ... పచ్చటి చెట్టును గొడ్డలితో పడగొట్టి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, బెరడును బ్లేడుతో సానబెట్టి, ఒళ్లంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు. ఈ కుర్చీలో ఎంత హింస దాగుందో కదా?... ఇలా జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకా ఓ మినీ యుద్ధమే దాగుంది" అంటూ పవన్ మాటలతో అజ్ఞాతవాసి ట్రైలర్ ప్రారంభమవుతుంది. 
 
ఈ మాటల వెనుక ఖుష్బూ, తనికెళ్ల భరణి వంటి స్టార్లు కనిపిస్తారు. తర్వాత యాక్షన్ సీన్స్, కాశీలో తీసిన కొన్ని సీన్స్ కనిపిస్తాయి. ఆది పినిశెట్టి వయెలెన్స్ ఇట్స్ నాట్ ఆన్ ఆప్షన్ అంటూ పలికే డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి. ఆపై పవన్ లవర్ బాయ్‌గా కనిపిస్తాడు. అనూ, కీర్తి సురేష్‌ల మధ్య రొమాంటిక్స్ సీన్స్ భలేగున్నాయి. 
 
ఒక నిమిషం 35 సెకన్ల నిడివి వున్న ఈ ట్రైలర్‌లో "కౌగిలించుకోలేదండీ... జస్ట్ పట్టుకున్నామంతే" అన్న పవన్ అనూతో చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మళ్లీ సైకిలెక్కుతాడా వర్మా?" అని మురళీ వర్మ ప్రశ్నించగా, "వాడు ఏదెక్కినా పర్లేదుగానీ మనల్ని ఎక్కకుంటే చాలు" అన్న రావు రమేష్ డైలాగ్ "వీడి చర్యలు ఊహాతీతం వర్మా... దట్స్ బ్యూటీ" అన్న డైలాగులు ఉన్నాయి. అజ్ఞాతవాసి ట్రైలర్ మీ కోసం..
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments