Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అజ్ఞాతవాసి'' బాహుబలిని బ్రేక్ చేస్తాడా?: కోటేశ్వర రావు పాటకు చిక్కులు

''అజ్ఞాతవాసి'' సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి. వరుసగా ఫ్లాపులు వచ్చినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేదు. అయినప్పటికీ సినిమా ఓవర్సీస్‌లోనూ అదరగొట్టేందుకు రెడీ అయ్యింది.

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (17:47 IST)
''అజ్ఞాతవాసి'' సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి. వరుసగా ఫ్లాపులు వచ్చినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేదు. అయినప్పటికీ సినిమా ఓవర్సీస్‌లోనూ అదరగొట్టేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ప్రివ్యూ టాక్ వచ్చేసింది. అంతేగాకుండా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని సమాచారం. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణల్లో ప్రత్యేక షోల ప్రదర్శనకు అనుమతి లభించింది. అమెరికాలోనూ అజ్ఞాతవాసి భారీ స్క్రీన్లలో విడుదల అవుతోంది. 
 
ఈ నేపథ్యంలో యూఎస్‌లో ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను సాధిస్తుందనేది ఒక అంచనా. ప్రీమియర్స్ తోనే అలవోకగా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు వస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బాహుబలి-2 ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేయడమే.. అజ్ఞాతవాసి టార్గెట్ అనే మాట వినిపిస్తోంది.
 
మరోవైపు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌ర్శ‌కుడు త్రివి‌క్ర‌మ్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న"అజ్ఞాత‌వాసి'' సినిమాలో పవన్ పాడిన ''కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు ఖ‌రుసైపోత‌వురో.." అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పాడిన పాట‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. 
 
అయితే, విజయవాడకు చెందిన కోటేశ్వ‌ర‌రావు అనే న్యాయ‌వాది ఈ పాట‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పాట ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోటేశ్వ‌ర‌రావు అనే పేరున్న అందరి మనోభావాలను దెబ్బతీసేలా వుందని చెప్పారు. కోటేశ్వ‌ర‌రావు పాట‌ను వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments