Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్జెస్ట్‌మెంట్ అనే మాట వినిపిస్తే చీల్చిచెండాడవచ్చు: ఐశ్వర్యా రాజేష్

హీరోయిన్లు చెప్తుండే అడ్జెస్ట్‌మెంట్ అనే పదం తనకు ఎదురైందని.. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని మణిరత్నం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఐశ్వర్యా రాజేష్ తెలిపింది. అచ్చ తెలుగమ్మాయి అయినప్పటికీ.. తమిళంల

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (10:49 IST)
హీరోయిన్లు చెప్తుండే అడ్జెస్ట్‌మెంట్ అనే పదం తనకు ఎదురైందని.. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని మణిరత్నం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఐశ్వర్యా రాజేష్ తెలిపింది. అచ్చ తెలుగమ్మాయి అయినప్పటికీ.. తమిళంలో రాణిస్తున్న హీరోయిన్.. తాజాగా మణిరత్నం చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నోరు విప్పింది. 
 
నటుడు రాజేశ్ కుమార్తెగా 'డాడీ' చిత్రంతో బాలీవుడ్‌లోనూ కాలుమోపిన ఐశ్వర్య, పదేళ్ల క్రితం పరిశ్రమలో తానూ లైంగిక వేధింపులతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. అప్పట్లో  అడ్జెస్ట్‌మెంట్ అనే పదం తనకూ ఎదురైందని.. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వెల్లడించింది. 
 
ఒకవేళ అడ్జెస్ట్‌మెంట్ అనే మాటెత్తితే మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వారిని చీల్చి చెండాడవచ్చని, అందువల్ల అలాంటి మాటలు చెప్పడానికి ఎంతో మంది భయపడుతున్నారని అంటోంది. తనకు హిందీ తెలియకుండానే బాలీవుడ్‌కు పరిచయం అయ్యానని వెల్లడించింది. ప్రస్తుతం అరవింద్ స్వామి, జ్యోతిక, శింబు వంటి స్టార్స్‌తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం