Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ రెండో సినిమా ''జున్ను'' రికార్డు సృష్టించిందట... హిట్ ఖాయమా?

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ రెండో సినిమాపై పూర్తిగా దృష్టి సారించాడు. పెళ్లి కాస్త రద్దు కావడంతో.. తొలి సినిమా అంత హిట్ కాకపోవడంతో.. ఇక పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టి హిట్ కొట్టాలని ఉవ

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (15:29 IST)
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ రెండో సినిమాపై పూర్తిగా దృష్టి సారించాడు. పెళ్లి కాస్త రద్దు కావడంతో.. తొలి సినిమా అంత హిట్ కాకపోవడంతో.. ఇక పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టి హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అందానికి అందం ఉండగా, చక్కని అభినయంతో ఎలాగైనా రెండో సినిమా ద్వారా ప్రేక్షకుల ద్వారా మంచి మార్కులు వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. 
 
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మొదలైన అఖిల్ రెండో సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే షూటింగ్ దశలో ఉండగానే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈనెల ప్రారంభంలో మొదలైన ఈ షూటింగ్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పిక్చరైజ్ చేసుకుంటోంది. ఈ చిత్రానికి ''జున్ను'' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. 
 
ఇక రికార్డు సంగతికి వస్తే.. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలులో జరుగుతోంది. దీంతో ఇంకా ప్రారంభం కాని హైదరాబాద్ మెట్రో రైల్‌లో షూటింగ్ జరుపుకున్న తొలిచిత్రంగా అఖిల్ సినిమా రికార్డ్ సృష్టించింది. ''మనం'' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కావడంతో నాగార్జున ఈ సినిమా విషయంలో విక్రమ్ కుమార్ కు బడ్జెట్ పరిమితులు ఇవ్వకుండా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలని చెప్పేశాడు. దీంతో అఖిల్ రెండో మూవీ కచ్చితంగా హిట్ కాక తప్పదని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments