Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను పక్కనుండగా మిస్ యూనివర్స్‌తో ఐకాన్ స్టార్

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (10:44 IST)
సాధారణంగా తమ ముందు భర్తలు పరాయి స్త్రీలతో మాట్లాడితో భార్యలు జీర్ణించుకోలేరు. తన భర్త తనకే సొంతం అన్నది వారి నైజం. ఈ విషయంలో సాధారణ మహిళ నుంచి సెలెబ్రిటీ మహిళల వరకు ఒకే తరహా నైజం ఉంటుంది. ఇపుడు అలాంటి ఫీలింగ్‌నే హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి వ్యక్తం చేశారు. 
 
ప్రస్తుతం న్యూయార్క్‌లో తన భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ పర్యటిస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో పాల్గొనడానికి ఆయన అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగువారు భారీ ర్యాలీని నిర్వహించారు. ఇందులో మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధూ కూడా హాజరయ్యారు. 
 
ఆమె బన్నీని చూడగానే హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి పలుకరించారు. దీంతో పుష్పరాజ్ కూడా నవ్వుతూ పలకరించారు. ఆ సన్నివేశాన్ని చూసిన బన్నీ భార్య స్నేహా రెడ్డి ఒక్కసారిగా ముభావంగా మారిపోయి ముఖాన్ని తిప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అయితే, తన భర్తకు మిస్ యూనివర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చిన సన్నివేశాన్ని చూసి స్నేహ రెడ్డి అలిగిందో లేదో తెలియదుగానీ ఆమె క్యాజువల్‌గా చూసిన లుక్‌ను నెటిజన్స్ మాత్రం మరిచిపోలేకపోతున్నారు. ఏంటి బన్నీ... భార్యను పక్కన పెట్టుకుని ఏంటా పనులు అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments