Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ 'పుష్ప' రిలీజ్ తేదీ ఖరారు

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (10:56 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె. సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్ర పుష్ప. ఈ చిత్రం విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప ది రైజ్‌’ విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది.
 
కొద్ది రోజుల క్రితం పుష్ప చిత్రం క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేశారు. అయితే డేట్‌పై ప‌లు ప్ర‌చారాలు జ‌రుగుతున్న వేళ‌, మేక‌ర్స్ పుష్ప చిత్రాన్ని డిసెంబర్ 17న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. 
 
డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయాల‌ని ముందుగా భావించ‌గా, భారీ బ‌డ్జెట్ చిత్రాలు ఆ రోజు విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో ఈ డేట్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో బ‌న్నీకి జోడీగా శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 
 
ఇటీవ‌ల ర‌ష్మిక పాత్ర‌కు సంబంధించిన లుక్ విడుద‌ల చేస్తూ, సినిమాలో ర‌ష్మిక పాత్ర పేరు శ్రీవ‌ల్లి అని తెలియ‌జేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొంద‌తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

ఏపీలో ట్రాన్స్‌మీడియా సిటీ.. 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.. చంద్రబాబు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments