Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపాల్ మాజీ భర్త విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా?

దర్శకుడు విజయ్, నటి అమలాపాల్‌కు విడాకులు ఇచ్చిన నేపథ్యంలో.. దర్శకుడు విజయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, తన మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి అమలాపాల్ క

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (10:07 IST)
దర్శకుడు విజయ్, నటి అమలాపాల్‌కు విడాకులు ఇచ్చిన నేపథ్యంలో.. దర్శకుడు విజయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, తన మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి అమలాపాల్ కన్నీటిపర్యంతమైందని.. తాను నటిస్తున్న సినిమా సెట్స్‌ నుంచి బాధతో వెళ్లిపోయిందని కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై విజయ్‌ స్పందించారు. తన అభిమానులకు, ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలన్నదే తన ఆశ విజయ్ తెలిపారు. 
 
అయితే తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి కేవలం వదంతులేనని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేని, అవాస్తమైన రెండో పెళ్లి వార్తలు నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేశాయని తెలిపారు. ఒక దర్శకుడిగా తన ఎదుగులకు సాయపడిన మీడియాలోనే ఇలాంటి వార్తలు రావడం మరింత బాధగా ఉంది. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందని చెప్పారు. 
 
కాగా 2014లో అమలాపాల్, విజయ్ పెళ్ళాడిన సంగతి తెలిసిందే. పెళ్లైన కొత్తలో వీరిద్దరి మధ్యనున్న అన్యోన్యతను చూసి.. ఇండస్ట్రీలో సక్సెస్ అయిన అతికొద్దిమంది జంటల్లో వీరిది ఒకటిగా నిలుస్తుందని అనుకున్నారు. అయితే సినిమాల్లో నటించేందుకు మంచి ఆఫర్లు రావడంతో సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అమలా ఇటు నటిగా, విజయ్ అటు దర్శకుడిగా తమతమ పనుల్లో నిమగ్నమైపోయారు.

ఈ క్రమంలో ధనుష్ సినిమాకు అమలాపాల్ ఓకే చేసింది. ఈ విషయం విజయ్‌కు ఏమాత్రం ఇష్టం లేదట. సినిమాల్లో నటించొద్దని చెప్పినా అమలాపాల్ వినలేదట. ఇదే వీరిద్దరూ విడాకులు తీసుకునేందుకు కారణమైందని కోలీవుడ్ వర్గాల్లో టాక్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments