Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాగా నటిస్తున్న అమితాబ్ బచ్చన్

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (12:48 IST)
స్టార్ ఇమేజ్ ఉన్న పెద్ద నటుడు సినిమాలో హిజ్రా పాత్ర వేస్తే అది షాకింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి సాహసమే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేయబోతున్నట్లు సమాచారం. దక్షిణాదిన మోస్ట్ సక్సెస్ ఫుల్ హార్రర్ కామెడీ సిరీస్ మునిలో వచ్చిన రెండో సినిమా కాంచనను హిందీలో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. 
 
ఈ సినిమా డైరెక్టర్ రాఘవనే హిందీ సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. కాంచనలో హిజ్రాగా శరత్ కుమార్ పోషించిన పాత్రను అమితాబ్ బచ్చన్ చేస్తుండటం విశేషం. అయితే ఏదేమైనా అమితాబ్ మాత్రం తన ఫ్రెంచ్ గడ్డాన్ని తీయడానికి ఇష్టపడడు. కానీ ఈ పాత్ర కోసం తీయవలసి వస్తుంది. మరి అమితాబ్ ఏం చేస్తాడో చూడాలి. 
 
అమితాబ్ ఈ పాత్రకు ఒప్పుకుంటే ఆ సినిమాకు అంతకంటే క్రేజ్ మరొకటి ఉండదు. మరోపక్క లారెన్స్‌కి ఈ సినిమా తీసే ఛాన్స్ రావడం తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ విషయం. కాంచనలో లారెన్స్ చేసిన పాత్ర హిందీలో అక్షయ్ కుమార్ చేయబోతున్నాడు. లారెన్స్‌కి హిందీ రాకపోయినా అక్షయ్ కుమార్ పట్టుబట్టి లారెన్స్‌తో డైరెక్షన్ చేయిస్తున్నాడు. 
 
అక్షయ్‌కు జోడీగా కియారా అద్వానీ నటించనుంది. ఈ చిత్రానికి హిందీలో లక్ష్మీబాంబు అనే పేరు కూడా ఖరారు చేశారు. బాలీవుడ్ స్టైల్‌కి తగినట్లుగా కొద్దిగా క్లాస్ టచ్‌ని జోడించి సినిమాను రీమేక్ చేయబోతున్నారు. కథలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రిచ్‌గా ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments