Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్‌ బచ్చన్‌కు సీరియస్ వ్యాధి.. ఫ్యాన్స్ షాక్

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (09:01 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గత కొంతకాలంగా ఓ వ్యాధితో బాధపడుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా వెల్లడించి ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేశారు. ఆ వ్యాధి ఏంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
అమితాబ్ ప్రధాన హోస్ట్‌గా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' అనే కార్యక్రమం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ కార్యక్రమం కోసం అహ్మదాబాద్ నుంచి వచ్చిన కాజల్ పటేల్ అత్యంత వేగంగా ఫాస్టెస్ట్ ఫింగర్‌లో సరైన జవాబులు చెప్పి హాట్ సీటుకు చేరుకున్నారు. గేమ్‌లో అమితాబ్‌ను కాజల్ పలు ప్రశ్నలు అడిగారు. వాటిలో ఒక ప్రశ్నకు అగ్రహీరో అమితాబ్ నుంచి వచ్చిన సమాధానం వింటే ఎవరైనాసరే ఖంగుతినాల్సిందే. 
 
గత 2000వ సంవత్సరంలో కేబీసీ ప్రారంభించిన సమయంలో తనకు వెన్నుపాము సంబంధిత క్షయవ్యాధి ఉందని వైద్యులు గుర్తించారన్నారు. ఈ వ్యాధిని నయం చేసేందుకు అనేక మందులు వాడాల్సి వచ్చిందన్నారు. 
 
ఈ వ్యాధి కారణంగా తానెన్నో ఇబ్బందులు పడ్డానని, కుర్చీలో కూర్చున్నప్పుడు ఎంతో నొప్పివచ్చేదని తెలిపారు. ఈ వ్యాధి నివారణకు చాలా మందులు వాడాల్సి వచ్చిందన్నారు. ఈ వ్యాధి నుంచి ఇపుడిపుడే బయటపడుతున్నట్టు తెలిపారు. 
 
ముఖ్యంగా, సమాజంలో ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నవారు అనేక మంది ఉన్నారనీ, ఈ వ్యాధిపై ప్రజల్లో మరింత అవగాహన తిసుకురావాల్సి ఉందన్నారు. అలాగే, స్వచ్ఛంధ సంస్థలు, వైద్య వర్గాలు ఈ వ్యాధిపై విస్తృతంగా ప్రచారం చేయాలని అమితాబ్ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments