Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ''సైరా''లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక రోల్?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్, టీజర్‌ను ఆగస్టు 22వ తేదీన జరిగిన మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (11:18 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్, టీజర్‌ను ఆగస్టు 22వ తేదీన జరిగిన మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి చేతుల మీదుగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అలాగే, ఈ చిత్రంలో నటించనున్న నటీనటుల పేర్లను కూడా అధికారికంగా ప్రకటించింది.
 
ఈ చిత్రం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్టులో కీలక తారాగణం స్క్రీన్‌పై కనిపించబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా చిరు లేటెస్ట్ మూవీకి సంబంధించి కొత్త వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. 
 
'సైరా నరసింహారెడ్డి'లో అమితాబ్ బచ్చన్ రోల్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని, ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో బిగ్ బీ కనిపిస్తారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 
 
కాగా, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై హీరో రాంచరణ్ నిర్మిస్తుండగా.. చిరుకు జోడీగా నయనతార నటిస్తోంది. జగపతిబాబు, సుదీప్, రఘుబాబు, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments