Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైరసీ వీడియోలు అమ్మాను.. వంగవీటి ఆడియోకు నాగార్జున, అమితాబ్.. వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు పెట్టింది పేరు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. తాను ఇంజినీరింగ్‌ ఫెయిల్‌ తర్వాత పైరసీ వీడియోలు అమ్మడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు.

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (12:29 IST)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు పెట్టింది పేరు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. తాను ఇంజినీరింగ్‌ ఫెయిల్‌ తర్వాత పైరసీ వీడియోలు అమ్మడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ మెగా బీ అమితాబ్‌ బచ్చన్‌ 'ఆఖరి రాస్తా' సినిమా పైరసీ వీడియోలు కూడా అమ్మానని, ఇప్పుడు ఆయనతోనే 'సర్కార్‌ 3' తీస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్‌‌తో వర్మ ఇంతకుముందు సర్కార్‌, డర్నా జరూరీ హై, నిశ్శబ్ద్‌, ఆగ్, సర్కార్‌ రాజ్‌, రణ్‌, డిపార్ట్‌ మెంట్‌, టైమ్‌ మెషీన్‌ సినిమాలు తీశారు. 
 
కాగా, రామ్‌గోపాల్‌ వర్మ తాజా చిత్రం 'వంగవీటి' ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌కి అమితాబ్‌ బచ్చన్, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ నెల 20న 'శివ టు వంగవీటి' పేరుతో హైదరాబాద్‌లో ఈ ఫంక్షన్‌ నిర్వహించనున్నారు. వంగవీటి సినిమాపై హైప్ తీసుకురావడానికి వర్మ తెలివిగా తన సినిమా జర్నీ పేరుతో.. బాలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోలతో ఒక కార్యక్రమం నిర్వహించి ‘వంగవీటి’ని మళ్లీ వార్తల్లో నిలపాలని ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్ జనం చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments