Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు బిడ్డల తల్లినైతే ఐటమ్ సాంగ్ చేయకూడదా?: అనసూయ

ఇటీవల ఓ పిల్లాడి ఫోనును నేలకేసి కొట్టి వివాదంలో చిక్కుకున్న బుల్లితెర యాంకర్‌, యాక్టర్ రంగమ్మత్త అదేనండి అనసూయ.. మళ్లీ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. రంగస్థలం సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపా

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (16:25 IST)
ఇటీవల ఓ పిల్లాడి ఫోనును నేలకేసి కొట్టి వివాదంలో చిక్కుకున్న బుల్లితెర యాంకర్‌, యాక్టర్ రంగమ్మత్త అదేనండి అనసూయ.. మళ్లీ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. రంగస్థలం సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. తాజాగా తనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయని చెప్పింది.


ఓవైపు యాంకర్‌‌లా టీవీల్లో కనిపించడం సరేకానీ.. మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేయడం ఎందుకని చాలామంది తనను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారని చెప్పింది. 
 
ఇద్దరు బిడ్డల తల్లివి అయినా ఈ ఐటమ్ సాంగ్స్ నీకు అవసరమా అంటూ అడుగుతున్నారని అనసూయ తెలిపింది. ఈ వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించింది. ఇద్దరు బిడ్డల తల్లినైతే ఏంటి? బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు పెళ్లి కావడమే కాకుండా పిల్లలు పుట్టాక కూడా రాణిస్తున్నారని గుర్తు చేసింది. 
 
ఒకప్పటి అగ్ర తారలైన భానుమతిగారు, సావిత్రిగారు పెళ్లయిన తర్వాత కూడా కెరీర్‌లో అద్భుతంగా రాణించారు. అప్పుడులేని విమర్శలు ఇప్పుడు ఎందుకు? వైవిధ్యభరితమైన పాత్రలు వచ్చినపుడు చేయడంలో తప్పు లేదంటూ అనసూయ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments