Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి కాబోతున్న టాప్ యాంకర్...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (14:18 IST)
తెలుగు టీవీ రంగంలో తక్కువకాలంలో క్రేజ్ సంపాదించుకున్న యాంకర్లలో లాస్య‌ కూడా ఒకరు. చిలిపితనం, అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లాస్య రవితో కలిసి చాలా షోలను వినోదభరితంగా నడిపించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో కలిసి చేయకూడదని నిర్ణయించుకున్నాక, లాస్య జోరు కాస్త తగ్గింది. ఆ సమయంలో మంజునాథ్‌ను వివాహం చేసుకుని అప్పుడప్పుడూ బుల్లితెరపై కనిపించడమే కానీ పూర్తి స్థాయిలో యాంకర్‌గా ఏ షో చేయడం లేదు. తాజా రెండో వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్న తరుణంలో మరో శుభవార్తను ఆమె ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 
 
10 సంవత్సరాల పరిచయం..9 సంవత్సరాల ప్రేమ బంధం..2 సంవత్సరాల పెళ్లి బంధం..అంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలతో పాటు తాను తల్లిని కాబోతున్నట్లు తెలుపుతూ ఫోటోలను పోస్ట్ చేసింది లాస్య. ఈ ఫోటోలలో లాస్య, మంజునాథ్‌లు ఎంతో అన్యోన్యంగా మరియు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బుల్లి వారసుడో, వారసురాలో వస్తే వీరి సంతోషం డబుల్ అవుతుంది. ఈ వార్త వినగానే ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments