Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుడిగాలి సుధీర్‌తో ప్రేమా లేదు.. పెళ్లీ లేదు: ఫేస్‌బుక్ లైవ్‌లో రష్మీ

సుడిగాలి సుధీర్‌తో ప్రేమ వ్యవహారంపై ఫేస్‍‌బుక్ లైవ్‌లో రష్మీ స్పందించింది. ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన రష్మీ... సుధీర్‌తో కలిసి ఎక్కువ ఈవెంట్స్ చేస్తుండటం వల్ల అలాంటి భావన ప్రేక్షకులకు, అ

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (09:15 IST)
సుడిగాలి సుధీర్‌తో ప్రేమ వ్యవహారంపై ఫేస్‍‌బుక్ లైవ్‌లో రష్మీ స్పందించింది. ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన రష్మీ... సుధీర్‌తో కలిసి ఎక్కువ ఈవెంట్స్ చేస్తుండటం వల్ల అలాంటి భావన ప్రేక్షకులకు, అభిమానులకు కలిగివుండవచ్చునని రష్మీ చెప్పింది. తాము చేస్తోన్న షో మంచిగా రావడం కోసం  మిగతా వాళ్లతో ఉన్నట్టుగానే సుధీర్‌‍తోను కాస్త సన్నిహితంగా ఉండాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. 
 
అలా సన్నిహితంగా వుండటం చూసి ప్రేమలో వున్నామని, పెళ్లి చేసుకుంటామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రష్మీ వెల్లడించింది. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన రష్మీ తాజా సినిమా 'నెక్స్ట్ నువ్వే' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులతో రష్మీ ఫేస్‍బుక్ లైవ్‌లో మాట్లాడింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకి చాలా వరకూ సహనంతో మాట్లాడిన రష్మీ, అప్పుడప్పుడు కాస్తంత అసహనానికి కూడా లోనైంది.
 
అంతేగాకుండా నెక్ట్స్ నువ్వే చిత్రం ఫ్లాప్ కావడం ఖాయం. నేను డిసైడ్ అయ్యాను అని ఓ నెటిజెన్ చేసిన వ్యాఖ్యలపై రష్మీ ఒకింత అసహనం వ్యక్తం చేసింది. సినిమా ఫ్లాప్ లేదా హిట్ అనేది ఏ ఒక్కరిపైనా ఆధారపడి ఉండేది కాదు. కావున మీరు అలా కోరుకుంటే బెస్టాఫ్ లక్ అని రష్మీ వ్యాఖ్యానించింది. నెగిటివ్‌గా థింక్ చేయకూడదు అని సలహా ఇచ్చింది. 
 
తెలుగు భాష మాట్లాడటం రాని నువ్వు తెలుగు సినిమాల్లో నటించడం మానుకో అని ఓ నెటిజన్ చేసిన కామెంట్స్‌కు రష్మీ మండిపడింది. వైజాగ్‌లో పుట్టి పెరిగాను. తల్లి ఒరిస్సా, తండ్రి యూపీకి చెందిన వాళ్లు. నేను కేంద్రీయ విద్యాలయాల్లో చదివాను. అక్కడ ప్రాంతీయ భాషను ప్రోత్సహించరు. కేవలం హిందీనే నేర్పిస్తారు. కేవలం భాష, ప్రాంతం, కులాన్ని ఆధారంగా చేసుకొని ఒకరి ప్రతిభను అంచనా వేయవద్దు అని రష్మీ  ధీటుగా సమాధానం ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments