Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి గా అనుష్క, నవీన్ పోలిశెట్టి

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (16:55 IST)
Miss Shetty and Mr. Polishetty
బాహుబలి తో దేవసేనగా ప్రపంచం వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ బ్యూటీ అనుష్క, మోస్ట్ టాలెంటెడ్ అనిపించు కున్న జాతిరత్నం నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ విడుదల చేశారు. వీరి కలయికలో సినిమా అనౌన్స్ అయినప్పుడే పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఓ రకమైన ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా ఫస్ట్ లుక్ టైటిల్ ను అనౌన్స్ చేసింది మూవీ టీమ్.

అనుష్క, నవీన్ పేర్లు కలిసి వచ్చేలా.. చూడగానే ఆకట్టుకునేలా ఈ చిత్రానికి "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" అనే టైటిల్ ను ఖరారు చేసింది చిత్రబృందం. ఈ టైటిల్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చాలా క్యాచీగా ఉండటంతో పాటు సినిమా కథకు కూడా ఈ టైటిల్ సరిగ్గా సరిపోయేలా ఉంటుంది అంటోంది మూవీ టీమ్. ఈ సినిమాలో నవీన్ 
సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌ పాత్రలో నటించారు. పి. మహేష్‌ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. 
 
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోతోన్న ఈ "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" చిత్రాన్ని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొంచించాడు దర్శకుడు పి. మహేష్‌ బాబు. నిశ్శద్ధం చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న అనుష్క.. తన ఇమేజ్ కు తగ్గట్టుగా అద్బుతమైన స్క్రిప్ట్ కావడంతో  కొంత గ్యాప్ తర్వాత ఈ పాత్రకు ఓకే చెప్పింది. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల చేత మంచి నటుడుగా ప్రశంసలు అందుకున్న నవీన్ పోలిశెట్టి కూడా కాస్త గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా ఇది. ఇక టైటిల్ తోనే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ వేసవికి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోంది. 
 
భారీ అంచనాలతో ఆసక్తికరమైన కలయికలో రాబోతోన్న ఈ చిత్రానికి సంగీతంః రధన్, సినిమాటోగ్రఫీః నీరవ్ షా,  ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు, పిఆర్.వోః జి.ఎస్.కె మీడియా, నిర్మాణ సంస్థః యూవీ క్రియేషన్స్, నిర్మాతలుః వంశీ - ప్రమోద్, 
రచన, దర్శకత్వంః మహేష్‌ బాబు. పి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments