Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లో కొట్టుకుంటున్న అంజలి, ఆమె చెల్లలు ఆరాధ్య

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫేమ్ అంజలి మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి ఆమె తన చెల్లెలు అని చెప్పబడుతున్న ఆరాధ్య ద్వారా వార్తల్లో నిలిచింది. గత వారం అంజలి చెల్లలు అంటూ ఆరాధ్య అనే యువతి తన ఫోటోలను పోస్టు చేస్తూ, తన అక్క అంజలి స్ఫూర్తితో సిని

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (13:23 IST)
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫేమ్ అంజలి మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి ఆమె తన చెల్లెలు అని చెప్పబడుతున్న ఆరాధ్య ద్వారా వార్తల్లో నిలిచింది. గత వారం అంజలి చెల్లలు అంటూ ఆరాధ్య అనే యువతి తన ఫోటోలను పోస్టు చేస్తూ, తన అక్క అంజలి స్ఫూర్తితో సినిమాల్లో అడుగుపెడుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే తను సముద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాననీ, మరో రెండుమూడు చిత్రాలు చర్చల దశలో వున్నాయంటూ ట్వీట్లో తెలిపింది. ఇందుకు తగ్గట్లుగా ఆరాధ్య పీఆర్వో అయితే అంజలి చెల్లెలు సినిమాల్లోకి వస్తున్నమాట నిజం అంటూ ఓ ప్రెస్ నోట్ పంపారు. 
 
ఈ వార్తను ట్విట్టర్లో చూసిన అంజలి స్పందిస్తూ... తనకు ఎవరూ చెల్లెళ్లు లేరని స్పష్టం చేసింది. తనకు వున్న ఒక్కగానొక్క అక్కకు పెళ్లయిపోయిందనీ, ఆమె చాలా సంతోషంగా వున్నదని ట్వీట్లో చెప్పుకొచ్చింది. మరి ఈ ఆరాధ్య ఎవరూ అని అంటే... అంజలి పిన్ని కుమార్తె అని తెలిసింది. 
 
గతంలో అంజలి తన పిన్నితో గొడవపడిన సంగతి తెలిసిందే. ఆ గొడవతో వాళ్లు మీడియా ముందుకు కూడా వచ్చారు. దానితో అంజలి తన పిన్ని నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఇప్పుడు ఆరాధ్య అనే యువతి అంజలి పిన్ని కుమార్తె అని తెలిసింది. కాబట్టి సినీ అరంగేట్రం చేసేందుకు సాయపడిన అంజలి పిన్నమ్మ కుమార్తే ఈ ఆరాధ్య. ఆ ముక్కనే అంజలి కూడా చెప్పేసి వుంటే సరిపోయేదని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments