Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు 'కార్తిక్ రత్నం' పుట్టినరోజు సందర్భంగా రానా 'అర్ధ శతాబ్దం' చిత్రం గ్లిమ్స్‌ రిలీజ్

Webdunia
సోమవారం, 6 జులై 2020 (11:59 IST)
రిషిత శ్రీ క్రియేషన్స్ మరియు అక్కి ఆర్ట్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో, నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం "అర్థ శతాబ్ధం" రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం గ్లిమ్స్‌ను హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు.
 
కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్పలో వెంకటేష్ కుమారుడిగా నటిస్తున్నాడు, అలాగే అర్థశతాబ్దం సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అసాధరణమైన రెస్పాన్స్ లభించింది. దర్శకుడు రవీంద్ర ఏదయితే స్టోరీ నేరేట్ చేశాడో.. దాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.

 
ప్రముఖ తారాగణం అంతా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది. సాంకేతిక నిపుణులు వివరాలు ఇవి, బ్యానర్: రిషిత శ్రీ క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్; రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లే, నిర్మాత: చిట్టి కిరణ్ రామోజు,
సహనిర్మాత : అక్కి; డిఓపి: అష్కర్ (బాయ్ ఫేమ్), సంగీతం: నౌఫల్ రాజా(ఎ.ఐ.ఎస్); ఆర్ట్: సుమిత్ పటేల్, కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ; ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్, పాటలు: రెహమాన్, స్టంట్స్: అంజి, పిఆర్ఓ: సాయి సతీష్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments