Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అర్జున్ రెడ్డి''ని తప్పక చూడండి.. బాహుబలి దేవసేన

అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ, శాలిని పాండే జోడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలివారంలోనే రూ.30కోట్ల మార్కును దాటింది. ఇటీవలే

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (17:29 IST)
అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ, శాలిని పాండే జోడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలివారంలోనే రూ.30కోట్ల మార్కును దాటింది. ఇటీవలే అర్జున్ రెడ్డి సినిమాకు మరో పది నిమిషాల సన్నివేశాలను యాడ్ చేశారు. తద్వారా ఈ చిత్రాన్ని మూడు గంటల పదకొండు నిమిషాల నిడివితో ప్రదర్శించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి సినిమా తప్పకుండా చూడాల్సిందేనని బాహుబలి దేవసేన అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. అర్జున్ రెడ్డిని తప్పక చూడండి.. అర్జున్ రెడ్డి సినిమా యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ.. నిజాయతీగా, మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని అనుష్క చెప్పుకొచ్చింది. కాగా, అనుష్క పోస్ట్ ఫై నెటిజన్లు స్పందించారు. థ్యాంక్యూ ఫర్ ప్రొమోటింగ్, ఈ సినిమా మీరెప్పుడు చూశారు అనుష్క?, సూపర్బ్ మూవీ అంటూ కామెంట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను చంపి ఇంట్లో పాతిపెట్టిన భర్త.. తర్వాత భయంతో ఆత్మహత్య!!

ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి.. పాకిస్థాన్ వెళతా : కర్నాటక మంత్రి (Video)

భారతీయ వంట మనిషిని ఉరితీసిన కువైట్!!

వధువే అసలైన కానుక... రూ.లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించిన వరుడు!!

బాబ్బాబు.. మీకు దణ్ణం పెడతాం.. భారత్ దాడి నుంచి రక్షించండి.. గల్ఫ్ దేశాలకు పాక్ వినతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments