Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందం, శాలరీ కోసం కక్కుర్తి పడకండి.. ఆరాతీయండి: విజయ్ దేవరకొండ

సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న వేళ.. తెలంగాణ సర్కారు.. సెలెబ్రెటీల చేత యువత, ప్రజల్లో చైతన్యం కలిగిస్తోంది. ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి, విజయ్ దేవరకొండను బరిలోకి దించింది. ఫేస్‌బుక్,

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (16:17 IST)
సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న వేళ.. తెలంగాణ సర్కారు.. సెలెబ్రెటీల చేత యువత, ప్రజల్లో చైతన్యం కలిగిస్తోంది. ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి, విజయ్ దేవరకొండను బరిలోకి దించింది. ఫేస్‌బుక్, వాట్సాప్, మాట్రీమోనీ సైట్లలో వచ్చే ప్రొఫైల్స్‌ చూసి మోసపోకూడదని అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ చేసే అలెర్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
నకిలీ ప్రొఫైల్స్ బోలెడు మాట్రీమోనీ సైట్లలో వున్నాయని ఆరా తీశాకే వివాహానికి కమిట్ అవ్వండి అంటూ విజయ్ దేవరకొండ ఆ వీడియో ద్వారా సందేశమిచ్చారు. పేటీఎం వంటి ఇతరత్రా మనీ యాప్స్ ద్వారా అలెర్ట్‌గా వుండాలని.. వీటిలో కొన్ని హ్యాక్ అవుతున్నాయని ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో మాట్రిమోనీ సైట్లలో వచ్చే ప్రొఫైల్స్ చూసి కక్కుర్తి పడకుండా ఆలోచించి.. ఆరాతీసి ముందుకుసాగండి అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు.
 
మాట్రిమోనీ సైట్లలో పరిచయం, ఫేస్‌బుక్‌‌లో మీటింగ్, స్కైప్‌లో ఎంగేజ్‌మెంట్.. ఓ షర్ట్ కొనాలంటేనే వాటి బ్రాండ్ ఆరాతీసి వందసార్లు ఆలోచించే మనం.. పెళ్లి దగ్గరకి వచ్చాక ఎందుకంత అజాగ్రత్తగా వుంటాం. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ప్రొఫైల్ చూసినప్పుడు వాళ్ల శాలరీ ఎంత వాళ్లు అందంగా వున్నారా అని కక్కుర్తి పడకండి. అసలు వాళ్లు నిజంగా వున్నారా? జన్యునా కాదా? చూస్కోండి. ఆరా తీయండి. సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా వుండండి... అంటూ విజయ్ దేవరకొండ వీడియో ద్వారా యువతను అప్రమత్తం చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments