Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2 తాజా కలెక్షన్లు హిందీలో రూ.500 కోట్లు.. రూ.1700 కోట్లకు చేరువలో వరల్డ్ వైడ్ కలెక్షన్లు

భారత దేశంలో ఒక భాషలో రూ.500 కోట్ల కలెక్షన్లు ఆర్జించిన మొట్టమొదటి సినిమాగా బాహుబలి2 చరిత్ర సృష్టించింది. బాలీవుడ్‌లో రూ. 500 కోట్ల క్లబ్‌లో ప్రవేశించిన తొలి హిందీ సినిమాగా బాహుబలి2 తిరుగులేని ఆధిపత్యం

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (10:13 IST)
భారత దేశంలో ఒక భాషలో రూ.500 కోట్ల కలెక్షన్లు ఆర్జించిన మొట్టమొదటి సినిమాగా బాహుబలి2 చరిత్ర సృష్టించింది. బాలీవుడ్‌లో రూ. 500 కోట్ల క్లబ్‌లో ప్రవేశించిన తొలి హిందీ సినిమాగా బాహుబలి2 తిరుగులేని ఆధిపత్యం నమోదు చేసింది. మంగళవారం అంటే మే 31న హిందీ బాహుబలి2 రూ. 1.25 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో హిందీ వెర్షన్ మొత్తం కలెక్షన్లు రూ.500 .15 కోట్లకు చేరుకుంది. ఇంతవరకు భారతదేశంలో ఒక హిందీ సినిమా చేసిన అత్యధిక వసూళ్లు రూ. 390 కోట్లు మాత్రమే. హిందీలోకి డబ్బింగ్ చేసిన సినిమా 500 కోట్లను సాధించడం కనీవినీ ఎరుగని రికార్డుగా బాలీవుడ్ అనలిస్టులు శ్లాఘిస్తున్నారు.
 
బాహుబలి 2 హిందీ కలెక్షన్లు ఎప్పుడో 500 కోట్ల రూపాయలను దాటిపోయాయని కొన్ని బాక్సాఫీస్ సైట్లు, కొందరు ట్రేడ్ ఎనలిస్టులు గతంలోనే చెప్పారు కానీ వాస్తవంగా మే 31నే బాహుబలి-2 ఆ ఫీట్‌ను సాధించింది. 
 
ఇకపోతే బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్ల వసూలు వైపు సాగుతోంది. అమీర్ ఖాన్ దంగల్ సినిమా తర్వాత రెండో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా బాహుబలి నమోదైంది. చైనాలో మే మొదటి వారంలో విడుదలైన దంగల్ సినిమా యావత్ చిత్రపరిశ్రమనే నిర్ఘాంతపరుస్తూ వెయ్యి కోట్లకు పైగా  సాధించడంతో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాహుబలి రికార్డు చెరిగిపోయింది. 
 
జూన్ నెలలో చైనా, జపాన్, సింగపూర్ దేశాల్లో బాహుబలి2 విడుదల చేయానికి నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో దంగల్ రికార్డును బాహుబలి-2 మళ్లీ ఛేదించనుందని భావిస్తున్నారు.
 
అయితే దంగల్ రికార్డును అలా పక్కనబెడితే దేశంలో 1700 కోట్ల వసూళ్లను సాధిస్తున్న తొలి భారతీయ చిత్రంగా బాహుబలి-2 రికార్డు చెరిపివేయడం సమీప భవిష్యత్తులో ఏ చిత్రానికీ సాధ్యం కాదని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
 
తెలుగు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన బాహుబలి 2లో ప్రభాస్, రాణా ప్రధాన పాత్రలు పోషించగా రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, కట్టప్ప, నాజర్ అద్వితీయ పాత్రలు పోషించి చిత్ర విజయానికి దోహద పడ్డారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments