Webdunia - Bharat's app for daily news and videos

Install App

"దంగల్" కలెక్షన్లు రూ.2 వేల కోట్లు.. కానీ ఫొగట్ కుటుంబానికి ఇచ్చింది ఎంతో తెలుసా?

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (13:47 IST)
అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన చిత్రం "దంగల్". గత 2016లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. మహావీర్ ఫొగట్ తన కుమార్తెలను ఎలైట్ రెజ్లర్‌లుగా ఎలా మార్చారనే దాన్ని చుట్టూత ఈ కథ తిరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు కూతుళ్లు దేశానికి పతకాలు సాధించడం చూపించారు. అయితే, ఈ చిత్రం ఏకంగా రూ.2 వేల కోట్ల మేరకు కలెక్షన్లు రాబడితే మహావీర్ ఫొగట్ కుటుంబానికి మాత్రం కేవలం కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకు స్పూర్తిగా నిలిచిన బబితా ఫొగట్ తాజాగా ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. 
 
రెజ్లింగ్‌కు అధికారికంగా గుడ్‌బై చెప్పిన బబితా ఫొగట్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె తాజాగా ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా "దంగల్" సినిమా మేకర్స్ నుంచి తమ కుటుంబానికి అందిన ఆర్థిక వివరాలను ఆమె వెల్లడించారు. తన కుటుంబానికి మేకర్స్ నుంచి కేవలం కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. 'దంగల్' సినిమాకు వచ్చిన రూ.2,000 కోట్లలో ఫోగట్ కుటుంబానికి కేవలం రూ.1 కోటి మాత్రమే వచ్చింది అని తెలిపారు. 
 
అయితే, ఇంత తక్కువ మొత్తం దక్కినందుకు మీకు బాధగా అనిపించలేదా? అని అడిగిన మరో ప్రశ్నకు బబితా తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు. తన కుటుంబం ఉద్దేశం ఈ మూవీ నుంచి డబ్బు ఆశించడం కాదన్నారు. ప్రజల నుంచి గౌరవం, ప్రేమను సంపాదించడం మాత్రమే అని అన్నారు.
 
ఈ సందర్భంగా తన తండ్రి తమతో ఒక విషయం చెప్పారని బబితా తెలిపారు. అదేంటంటే.. తమకు ప్రజల ప్రేమ, గౌరవం మాత్రమే కావాలి, డబ్బు ముఖ్యం కాదన్నారని ఆమె పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments