Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేఎస్ రవికుమార్‌తో బాలయ్య సినిమా ఆగిపోయిందట..

Webdunia
గురువారం, 30 మే 2019 (13:54 IST)
విభిన్న కథా చిత్రాల దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నాడని ఎన్నికల ముందు నుంచి టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడనే వార్త కూడా గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. 
 
ఏ కారణం చేతనో కానీ ఇప్పుడు ఈ కథను పక్కన పెట్టేశారనే టాక్ ఫిల్మ్ నగర్‌లో బలంగా వినిపిస్తోంది. ఒక ప్రాంతానికి సంబంధించిన రాజకీయాలు, ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడిన కథను కేఎస్ రవికుమార్ టేకాఫ్ చేశాడట. 
 
ఈ కథలో ఒక తరం విలన్‌గా తాత, మరో తరం విలన్‌గా మనవడు కనిపిస్తారట. దానితోపాటు ఈ సినిమాలోని కొన్ని పాత్రలు పాత సినిమాలను గుర్తుకు తెచ్చేలా ఉండటంతో, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కథను టచ్ చేయకపోవడమే మంచిదని ఈ చిత్ర బృందం నిర్ణయించుకుందట. 
 
అందులో భాగంగానే ముందుగా అనుకున్న సినిమా కాకుండా కాస్త వెరైటీగా కొత్త సినిమాను లైన్‌లో పెట్టే యోచనలో ఉన్నారు హీరో బాలకృష్ణ. మరో కొత్త కథ సిద్ధమయ్యేదాకా బాలకృష్ణ వేచి చూస్తాడో లేక ముందుగా బోయపాటితో అనుకున్న సినిమాను పూర్తి చేస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments