Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకింది నిజమే... నిర్మాత బండ్ల గణేశ్

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (10:46 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ కరోనా వైరస్ బారిపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే తనను కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద చెప్పుకొచ్చారు. పైగా, చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేరనున్నట్టు తెలిపారు. 
 
గత రెండు రోజులుగా బండ్ల గణేశ్‌కు కరోనా సోకినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తుండగా, తనను సంప్రదించిన మీడియా ప్రతినిధులకు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారట. నిర్మాత బండ్ల గణేశ్‌కు కరోనా వైరస్ సోకడంతో టాలీవుడ్ అలర్ట్ అయింది. 
 
అపోలో లేదా కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేరనున్నానని, ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఇటీవల బండ్ల గణేశ్ హెయిర్ ప్లాంటేషన్ నిమిత్తం వెళ్లగా, అనారోగ్య లక్షణాలను చూసిన అక్కడి డాక్టర్ కరోనా టెస్టుకు రిఫర్ చేశారట. ఆ వెంటనే బండ్ల గణేశ్ కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలింది. 
 
ఇదిలావుండగా, దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 14,516 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరోజు కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 
 
అలాగే 24 గంటల్లో 375 మంది మరణించడం జరిగింది. తాజా కేసుల చేరికతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
ప్రస్తుతం 1,68,269 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 2,13,831 మంది చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. ఇప్పటివరకూ 12,948 మంది మరణించారని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments