Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేమ డ్రగ్స్ తీసుకున్నారు.. చార్జిషీటులో పేర్కొన్న బెంగుళూరు పోలీసులు (Video)

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (10:44 IST)
నటి హేమకు బెంగుళూరు పోలీసులు తేరుకోలేని షాకిచ్చారు. బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ... డ్రగ్స్ తీసుకున్నారని వారు తేల్చారు. ఈ మేరకు ఈ కేుసులో కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో పేర్కొన్నారు. బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ ఎండీఎంఏ రకం డ్రగ్స్ సేవించినట్టు పోలీసులు చార్జిషీటులో పేర్కొమన్నారు. పార్టీలో ఎండీఎంఏ డ్రగ్‌ను హేమ సేవించినట్టు ఆధారాలు చూపిస్తూ వైద్య పరీక్షల నివేదికలను చార్జిషీటుకు జతపరిచారు. 
 
ఈ పార్టీలో హేమతో పాటు 79 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎన్డీపీఎస్ సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా పేర్కొన్నారు. హేమతో హాజరైన మరో యాక్టర్‌కు డ్రగ్స్ టెస్ట్ నెగెటివ్‌గా వచ్చినట్టు తెలిపారు. బెంగుళూరు పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌తో సమసిపోయిందని భావించిన నటి హేమ డ్రగ్స్ కేసు మళ్లీ మొదటికొచ్చేలా ఉంది. 
 
ఆమె కొన్ని రిపోర్ట్స్ పట్టుకుని తాను డ్రగ్స్ సేవించలేదంటూ ఇటీవల హడావుడి చేశారు. దీంతో ఆమెపై ఉన్న నిషేధాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎత్తివేసింది. అలాగే, మీడియా ముందుకు వచ్చిన ఆమె.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇపుడు చూస్తే కేసు మళ్లీ మొదటికి వచ్చింది. మరి ఇపుడు హేమ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సివుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

Indian Student: అమెరికాలో కూడా ఇలాంటి ఆటలా? భారతీయ విద్యార్థి అరెస్ట్

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments