Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళంలో డబ్బింగ్ చెప్పుకుంటున్న ''భరత్ అనే నేను''

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా రూపొందిన భరత్ అనే నేను సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా భరత్ అనే నేను సినిమా రూ.200 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ఓవర్సీస్‌లో మరింత

Webdunia
శనివారం, 12 మే 2018 (15:56 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా రూపొందిన భరత్ అనే నేను సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా భరత్ అనే నేను సినిమా రూ.200 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ఓవర్సీస్‌లో మరింత దూకుడుగా కలెక్షన్లు రాబడుతోంది. బాహుబలి సినిమా తర్వాత అంత వేగంగా అమెరికాలో కలెక్షన్ల మార్కును సాధించిన చిత్రంగా భరత్ అనే నేను సినిమా రికార్డు సృష్టించింది.
 
తాజాగా మహేష్ బాబు వచ్చే నెల నుండి వంశిపైడిపల్లి సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భరత్ అనే నేను సినిమా తమిళంలోకి డబ్ కానుంది. తమిళనాట తెలుగు వెర్షన్ కూడా మంచి వసూళ్లను సాధించింది. చెన్నైలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగాను భరత్ అనే నేను సినిమా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదించాలని సినీ యూనిట్ భావిస్తోంది. 
 
ఇప్పటికే యూనిట్ డబ్బింగ్ పనులను మొదలెట్టేశారు. డబ్బింగ్ పూర్తయ్యాక తమిళ వర్షన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు కొరటాల టీమ్ ప్రకటించింది. ఇక కొరటాల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో, మహేశ్ బాబు జోడీగా కైరా అద్వాని నటించిన సంగతి తెలిసిందే.  తమిళ డబ్బింగ్‌ పూర్తి చేసుకున్నాక ఈ సినిమా ''భరత్'' అనే పేరిట విడుదలవుతుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments