Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ముంబైకి బయలుదేరిన భారతీయుడు 2 టీం

డీవీ
మంగళవారం, 25 జూన్ 2024 (15:14 IST)
kamal haasan shankar shanmugh Siddharth
నేడు ‘భారతీయుడు 2’  టీం ముంబైకి బయలుదేరింది. ఎయిర్ పోర్ట్ లో శంకర్, కమల్ హాసన్, సిద్ధార్థ.. కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ఈ రోజు సాయంత్రం 7గంటలకు ఫంక్షన్ జరగనుంది. నేడు మంగళవారం  ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది.
 
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ ముస‌లి పాత్ర‌లోని క‌మ‌ల్ హాస‌న్ ట్రాలీ బ్యాగ్‌తో మెట్లు ఎక్కుతున్నారు. అంటే పోస్ట‌ర్‌తో ట్రైల‌ర్ వచ్చేస్తుంద‌నే విష‌యాన్ని సింబాలిక్‌గా చ‌క్క‌గా చెప్పిన‌ట్లుంది పోస్ట‌ర్ చూస్తుంటే. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ మెప్పించారు. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా ‘భారతీయుడు 2’ రానుంది. మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారోనంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు స‌హా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ అలెర్ట్!!

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments