Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో లెజండరీ సింగర్ కన్నుమూత - ప్రధాని మోడీ సంతాపం

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (10:54 IST)
భారతీయ చిత్రపరిశ్రమ మరో లెజండరీ సింగర్‌ను కోల్పోయింది. ఆయన పేరు భూపిందర్ సింగ్. ఎన్నో మధుర గీతాలను ఆలపించిన ఈయన సోమవారం రాత్రి కన్నుమూశారు. ఈయన మరణంతో బాలీవుడ్​లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​ అని తెలిసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయితే ఆయనకు పెద్ద పేగు క్యాన్సర్​ ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.
 
కాగా, భూపిందర్ సింగ్ ఐదు దశాబ్దాల పాటు బాలీవుడ్​లో ఎన్నో సుమధురమైన గీతాలను ఆలపించారు. అనేక మంది దిగ్గజ సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు. 'నామ్ గమ్ జాయేగా', 'దిల్ ధూండతా హై', 'దో దివానే షెహర్ మే', 'ఏక్ అకేలా ఈజ్ షెహర్ మే', 'తోడి సి జమీన్ తోడా ఆస్మాన్', 'దునియా చూటే యార్ నా చూటే' వంటి అనేక క్లాసిక్​ పాటలు పాడారు భూపిందర్ సింగ్.
 
మరోవైపు భూపిందర్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన పాటలు ఎంతో మందికి కదిలించాయన్నారు. దశాబ్దాల పాటు చిరస్మరణీయమైన పాటలను అందించిన భూపిందర్ సింగ్​జీ మరణం బాధగిలిగిందన్నారు. అలాగే, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నివిస్ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

AP Job Notification: నెలకు రూ.60,000 జీతం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన భారత్.. పార్శిళ్లు.. మెయిల్స్ నిలిపివేత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments