Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీత-సామ్రాట్‌ల మధ్య కొత్త బంధం చిగురించింది...

బిగ్‌‌బాస్ సీజన్ 2 నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ ఒకరిపై మరొకరికి ఉన్న అభిప్రాయాలను తెలుపుకునేలా మంచి అవకాశం కల్పించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా రెడ్ టీషర్ట్‌లను పంపాడు. హౌస్‌మేట్ వేసుకున్న తర్వాత, ఆ టీషర్ట్ మీద వారిపై ఉండే ‘గుడ్ విష్’ రాయాల్సి ఉంటుంది.

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (11:50 IST)
బిగ్‌‌బాస్ సీజన్ 2 నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ ఒకరిపై మరొకరికి ఉన్న అభిప్రాయాలను తెలుపుకునేలా మంచి అవకాశం కల్పించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా రెడ్ టీషర్ట్‌లను పంపాడు. హౌస్‌మేట్ వేసుకున్న తర్వాత, ఆ టీషర్ట్ మీద వారిపై ఉండే ‘గుడ్ విష్’ రాయాల్సి ఉంటుంది. కౌశల్, దీప్తీ, గీత, సామ్రాట్, తనీష్‌లు ఈ టాస్క్‌లో భాగంగా మంచి మంచి కామెంట్స్ రాస్తూ హౌస్ అంతా పాజిటివిటీ నింపేసారు.
 
ఇందులో భాగంగా గీత సామ్రాట్‌ల మధ్య ఒక కొత్త బంధం చిగురించింది. గీత తనకు మంచి ఫ్రెండ్‌ మాత్రమే కాదని, అమ్మలాంటిదని సామ్రాట్ రాయగా, సామ్రాట్ కూడా తనకు కొడుకు, తండ్రి, సోదరుడు లాంటివాడని గీత రాసింది. ఇక ఎప్పుడూ ఉప్పు నిప్పుగా ఉండే తనీష్, కౌషల్‌లు కూడా ఆశ్చర్యం కలిగించేలా కామెంట్స్ రాసుకున్నారు. ‘‘ప్రేమ పూజారీ.. నీ ప్రేమను మాకూ పంచు’’ అని తనీష్ టీషర్ట్ మీద కౌశల్ రాశాడు. 
 
‘‘మీరు మీ కుంటుంబానికి, మీ ఆర్మీకి ఎప్పుడూ తోడుగా ఉండాలి’’ అని తనీష్ రాసాడు. ఇక తనీష్-గీతల పాజిటివ్ కామెంట్స్ కూడా ఆసక్తికరంగా అనిపించాయి. ‘‘నందుకే కాకుండా నువ్వు నాకు కూడా ఫ్రెండే’’ అని గీత రాసింది. మొత్తానికి బిగ్ బాస్ ఎప్పుడూ ఫిట్టింగులు పెట్టే టాస్కులే కాకుండా బంధాలను పెంచుకునే టాస్కులు కూడా బాగానే ఇస్తున్నాడన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments