Webdunia - Bharat's app for daily news and videos

Install App

హంతకురాలిగా ఎంపికైన గీతామాధురి... బిగ్ బాస్ ఇదేం టాస్క్?

నిన్నటి ఎపిసోడ్‌లో మర్డర్ మిస్టరీ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో హంతకురాలిగా ఎంపికయ్యారు గీతామాధురి. హత్యలను ఎలా చేయాలనే ఆదేశాలతో పాటు ఆమెకు కొన్ని సీక్రెట్ టాస్క్స్ కూడా ఇచ్చారు. ఎవరికైనా స్వీట

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (18:03 IST)
నిన్నటి ఎపిసోడ్‌లో మర్డర్ మిస్టరీ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో హంతకురాలిగా ఎంపికయ్యారు గీతామాధురి. హత్యలను ఎలా చేయాలనే ఆదేశాలతో పాటు ఆమెకు కొన్ని సీక్రెట్ టాస్క్స్ కూడా ఇచ్చారు. ఎవరికైనా స్వీట్స్ తినిపించడం, ఎవరితోనైనా గొడవపెట్టుకోవడం, ఎవరినైనా మర్డర్ చేయడం, బెడ్‌పై మసాలా వేయడం లాంటి సీక్రెట్ టాస్క్‌లు ఇచ్చారు.
 
వీటిని కంప్లీట్ చేస్తే.. మీరు ఎలిమినేషన్‌ నుండి మినహాయింపు పొందడమే కాకుండా మీరు సూచించే వ్యక్తి ఎలిమినేషన్‌లో ఉంటారన్నారు. ఒకవేళ వీటిని చేయకపోతే, మీరు ఎలిమినేషన్‌లో ఉంటారంటూ మెలికపెట్టారు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లో గొడవలకు కేంద్రబిందువైన కౌషల్‌ను ఎంచుకుని ఏమాత్రం కష్టపడకుండానే ఈజీగా గొడవ మొదలుపెట్టింది గీతామాధురి. ఈ విధంగా మొదలైన మాటల యుద్ధం చాలా ముదిరి వ్యక్తిగత దూషణ వరకు వెళ్లింది.
 
మీరు రోజుకొక మాట మాట్లాడితే కష్టం, మీ సింపతీ కోసం నన్ను తోసేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని గీతామాధురి చెప్పగా వెంటనే కౌషల్ ఆపిల్ టాస్క్‌లో ఆవిడ బూతులు తిడుతుంటే మీరు పక్కనే ఉన్నారు కదా. అప్పుడు మీరు ఏం చేశారు. వింటున్నారా అంటూ కౌశల్ గీత మాధురిని ప్రశ్నించగా గీతతో పాటుగా అక్కడున్న హౌస్ సభ్యులంతా అవాక్కయ్యారు. హౌస్ కెప్టెన్ వారిని వారించే ప్రయత్నం చేసింది.
 
ఆ తర్వాత గీతా మాధురి మరొక సీక్రెట్ టాస్క్‌గా జరిగిన గొడవకు సారీ చెప్తూ కౌషల్‌కే బ్రెడ్ తినిపించారు. ఇందులో కొసమెరుపేంటంటే టాస్క్ కోసం గొడవపెట్టుకున్నప్పటికీ అందులో మాట్లాడిందంతా తన మనస్సులో ఉండేదేనని గీత బిగ్ బాస్‌కి స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో ముఖ పరిచయం.. ఆపై న్యూడ్ ఫోటోలు పంపాలంటూ జైలర్ వేధింపులు!!

పవన్ కల్యాణ్‌పై మాట్లాడే హక్కు కవిత లేదు.. క్షమాపణ చెప్పాల్సిందే: జనసేన

తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ మారాయా? రైల్వే శాఖ ఏం చెబుతోంది!

ములుగు జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయిన 22మంది మావోలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments