Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 - క్వారంటైన్‌లో కంటెస్టెంట్స్

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (12:33 IST)
బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆలరించే రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇపుడు ఐదో సీజన్‌కు సిద్ధమవుతోంది. నిజానికి ఎపుడో ప్రారంభంకావాల్సిన ఈ షో... కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. 
 
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది. ఈ షో ప్రోమో ఇప్పటికే షూట్ చేసినట్లు .. స్వాతంత్య దినోత్సవ కానుకగా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ షో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకానుంది.
 
బిగ్ బాస్ షో మరోసారి టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్‌లను కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సీజన్‌లో ఎక్కువమంది లేడీస్ కంటెస్టెంట్లు ఉండనున్నారట. 
 
షో లో పాల్గొనడానికి సెలెక్ట్ అయినవారు ఆగష్టు 22 నుండి క్వారెంటిన్‌లోకి వెళ్లిపోయారు. అక్కడ 15 రోజుల క్వారెంటిన్ తర్వాత సెప్టెంబర్ 5న కంటెస్టంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే హౌస్ మేట్స్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు కూడా పూర్తి చేసుకున్నాకే బిగ్ హౌస్ లోకి పంపనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments