Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. కంటిస్టెంట్స్ లిస్ట్ ఇదేనా?

Webdunia
సోమవారం, 24 జులై 2023 (14:43 IST)
వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ 7 తెలుగు కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంటెస్టెంట్స్ గురించి తెలుసుకోవాలని బిగ్ బాస్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాలంటే, బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు-7కి రంగం సిద్ధం అవుతోంది. 
 
ఈ ఏడాది మళ్లీ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. అందరినీ ఆకట్టుకున్న కొత్త సీజన్ ప్రోమోను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. టీవీ నటులు అమర్‌దీప్ చౌదరి, తేజస్విని ఈసారి బిగ్ బాస్ 7 తెలుగు హౌస్‌లోకి ప్రవేశించబోతున్నారు. 
 
అమర్‌దీప్ ఐరావతం, రాజుగారి కిడ్నాప్ వంటి సినిమాల్లో కనిపించాడు. తేజస్విని కూడా పలు సీరియల్స్‌లో నటిస్తోంది. తెలుగు, కన్నడ సీరియల్స్‌లో పనిచేస్తున్న టీవీ నటి శోభా శెట్టి కూడా బిగ్ బాస్ 7 తెలుగు పోటీదారుల్లో ఒకరు. 
 
బిగ్ బాస్ 7కి సింగర్ మోహన భోగరాజు పేరు కూడా పరిశీలనలో ఉంది. బుల్లెట్టు బండి పాటతో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన మోహన బిగ్ బాస్ లో పాల్గొనాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
 
 యాంకర్ విష్ణు ప్రియ, ఢీ షో పాండు, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ పేర్లను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. యూట్యూబర్ శ్వేతా నాయుడు, నిఖిల్ పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments