Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 5: వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీలో నవ్య, వర్షిణి

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (16:58 IST)
బిగ్ బాస్ 5లో రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం, మంగళవారం ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ప్రత్యేకించి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. ఒక్కొక్కరుగా ముసుగు తొలగిస్తుండడంతో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. అసభ్యకర కామెంట్స్ కారణంగా నెటిజన్లు ఉమాదేవిపై, పొగరుగా బిహేవ్ చేసినందుకు శ్వేత వర్మపై కూడా ఫైర్ అయ్యారు. 
 
శ్వేత వర్మ లోబో ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ని విసిరి అతడిని ఫేక్ అని పిలిచింది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనీ పట్ల ఉమా దేవి అగౌరవంగా, అమానవీయంగా ప్రవర్తించినందుకు ఆమెనూ విమర్శించింది. రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారమే ముగిసినప్పటికీ ఇంకా అదే చర్చనీయాంశం అవుతోంది. నిన్న కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గేమ్ కూడా కొట్టుకోవడానికే అన్నట్టుగా ఆడారు.
 
తాజా బజ్ ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు రాబోయే రెండు వారాల్లో వైల్డ్ కార్డ్‌గా మరో అందమైన మహిళను హౌస్ లోకి పంపడానికి ప్లాన్ చేస్తున్నారు. నవ్య లేదా వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఇంతకుముందు నవ్య బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ప్రవేశిస్తుందని టాక్ బాగా వినిపించింది. 
 
అయితే ఆమె హౌస్ లో అడుగు పెట్టలేదు. దీంతో ఈ సీజన్‌లో నవ్య వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం 'బిగ్ బాస్ 5' తెలుగు మేకర్స్ యాంకర్ వర్షిణితో కూడా చర్చలు జరుపుతున్నట్లు మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్స్ లో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments